KDP: ఒంటిమిట్ట(M) ఇరుకురాళ్ల బోటు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కడపలోని మరాటి వీధికి చెందిన ఆదెమ్మ, సుగుణ, సాయి కిరణ్ స్కూటీపై రాజంపేట నుంచి కడపకు బయలుదేరారు. ఈ క్రమంలో ఇరుకు రాళ్ల వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.