SRD: ఖేడ్ మండలం పీర్లతాండలోని కట్ట మైసమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పూజలు చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం నిర్వాహకులు ఎంపీకి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జీవుల నాయక్, IRS అధికారి సుధాకర్ నాయక్, బీసీ సెల్ కాంగ్రెస్ నాయకుడు సాయిలు పటేల్, తదితర నాయకులు పాల్గొన్నారు.