KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 16 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు ఆర్థిక భరోసా అని తెలిపారు. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిరెడ్డి, మోహన్, సంజీవ్, మల్లప్ప పటేల్ పాల్గొన్నారు.