EG: గోదావరి వరదల కారణంగా తూ.గో జిల్లాలో రానున్న 5 రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆదివారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో వేగంగా చర్యలు తీసుకోవాలని, బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి, సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.