NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన సంక్షేమ హాస్టల్, వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులు ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం అందజేశారు. గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు మంత్రిని కోరారు.