కోనసీమ: జిల్లా కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు, నాలుగు మున్సిపాలిటీలు, 22 మండల కేంద్రాలలో కూడా పీజీఆర్ఎస్ ఉంటుందని ఆయన తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను నేరుగా వచ్చి తెలుపుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు అందరూ పాల్గొనాలన్నారు.