SS: పెనుకొండ మండలం చంద్రగిరిలో శ్రీగిరి శక్తి పీఠంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం 7వ రోజు మహేశ్వరి దేవి శ్రీ శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీగిరి పీఠాధిపతి దేవేంద్ర స్వామి అమ్మవారిని క్యారెట్, బీంచ్, పచ్చిమిర్చి, వంకాయ, ముల్లంగి, మిరపకాయ, ఆకుకూరలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.