SKLM: సైనిక దళంలో గన్నర్స్ కు ప్రత్యేక గౌరవం ఉందని ఈ క్రమంలో గన్నర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం నరసన్నపేటలో ఒక కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సైనిక దళంలో ఒక భాగంగా గన్నర్స్ విభాగం కొనసాగుతుందని వివరించారు. ఈ దిశగా 400 మందికి పైగా సైనికులు పాల్గొన్నారు.