TG: ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై విమర్శలకు సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. కొందరు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, తనకు అక్కడ భూములున్నందు వల్లే ఈ ప్రాజెక్టు చేపడుతున్నానని విమర్శిస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలను ఖండించిన సీఎం, ‘నాకు భూములు ఉంటే రికార్డుల్లో ఉంటాయి కదా’ అని బదులిచ్చారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్ తరాల కోసమేనని వివరించారు.