JN: తరిగొప్పుల మండల కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులున్నారు.