GNTR: రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఇబ్రహీంను ఆదివారం మంగళగిరిలో కాపు, టీడీపీ నాయకులు కలిసి అభినందించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇచ్చారని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇబ్రహీం చిత్తశుద్ధితో పనిచేసి, మైనారిటీల అభివృద్ధికి కృషి చేసి, పదవికి వన్నె తేవాలని వారు ఆకాంక్షించారు.