NZB: దసరా పండుగకు తమ ఊరికి వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ CP సాయి చైతన్య తెలిపారు. ఊరికి వెళ్లేవారు చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే తమ ఏరియాలకు వచ్చేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.