WGL: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్లోని ధర్మారం, కట్టమల్లన్న వద్ద సద్దుల బతుకమ్మ సందర్భంగా చేపట్టుతున్న ఏర్పాట్లను ఆదివారం స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ ఆడుకునేందుకు తగినఏర్పాట్లు చేయాలని అదికారులకు పలు సూచనలు చేశారు.