AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని సప్పరం వాహనంపై అధిష్టింపచేసి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో మాడవీధుల్లో ఊరేగించి తిరువీధి ఉత్సవం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు తెలిపారు.