TPT: తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం అద్భుతంగా చేసిందని అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశంసించారు. ముఖ్యంగా కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్యతోపాటు ఇతర అధికారులు ఎక్కడా లోటుపాట్లు లేకుండా కృషి చేశారని కొనియాడారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, తెలిపారు.