VZM: అక్టోబర్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ముందుగా హెలిప్యాడ్ స్థలాన్ని, మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, ఇతర అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు.