CTR: జిల్లాలోని 48 PHCలో ఆగస్టులో కేవలం 53 కాన్పులే జరగాయన్న దారుణం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో వెల్లడైంది. GDనెల్లూరు, శాంతిపురం, రొంపిచర్ల, విజయపురం, పులిచర్ల, కల్లూరు PHCలలో కనీసం ఒక్క కాన్పు కూడా నమోదు కాలేదు. అరకొర వసతులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చాలా కేసులు చిత్తూరుకు రెఫర్ అవుతున్నా వాటిలో ఎక్కువగా అంబులెన్స్లలోనే అవుతున్నట్లు సమాచారం.