W.G: అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ అని వ్యాఖ్యానించారు. ఆనాడు బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా కాపాడింది వైఎస్ఆర్ కుటుంబమే అని అన్నారు.