ఆసియా కప్-2025 ఫైనల్లో భాగంగా దుబాయ్ వేదికగా ఇవాళ భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు ఇరు దేశాల జాతీయ జెండాలను మైదానంలోకి తీసుకు రావద్దని ఆంక్షలు విధించారు. సెల్ఫీ స్టిక్స్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ చేయకూడదని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే రూ.1.2 లక్షల నుంచి రూ. 7.24 లక్షల వరకు ఫైన్ విధించే అవకాశముందని అన్నారు.