SRD : అమీన్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో 3 కోట్ల 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పలు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు.