సత్యసాయి: హిందూపురం టీచర్స్ కాలనీలో మోక్షిత్ అనే చిన్నారిపై ఆదివారం వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల భారిన నుండి తమను కాపాడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.