NTR: కృష్ణానది వరద గణనీయంగా పెరుగుతోంది. ఇవాళ విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 6,02,206 క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీకి వరద తాకిడి విపరీతంగా పెరిగింది. పంట కాలువలకు 8,836 క్యూసెక్కులు, సముద్రంలోకి ఔట్ ఫ్లో 5,93,370 క్యూసెక్కులు విడుదల చేసినట్లు వెల్లడించారు.