TG: భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకొంటాం. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా’ అని పేర్కొన్నారు.