GNTR: వరదల పరిస్థితిపై సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, అన్నవరంపాలెం లంక గ్రామాల కృష్ణా నది వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సూచనలకై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08963 2234014 లో తెలపాలన్నారు.