తమిళ హీరో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీ టైటిల్ టీజర్ ఇవాళ విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు తొక్కిసలాట కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉండనున్నట్లు చెప్పారు.