ప్రకాశం: యర్రగొండపాలెంలోని పంచాయతీ కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఇవాళ నిర్వహించారు. గుర్రం జాషువా విగ్రహానికి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.