SDPT: SFI సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల అభిషేక్ భాను, టౌన్ ప్రెసిడెంట్ పెరిక అంజి, జిల్లా నాయకులు నవదీప్, సాయి, హర్షవర్ధన్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.