BPT: ప్రాంతీయ పశువైద్యశాలలో ప్రపంచ రాబీస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 6,000 మరణాలకు రాబీస్ కారణమవుతోందని, ఎక్కువగా 15-20ఏళ్ల యువతే దీని బారిన పడుతున్నారని సహాయ సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. రాబీస్పై అవగాహన లేకపోవడం, వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉండటమే దీనికి కారణమన్నారు. ఈ సందర్భంగా 40 కుక్కలకు టీకాలు వేశారు.