ATP:గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఈనెల జరిగే కౌన్సిల్ సమావేశం రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉన్నందున, సెప్టెంబర్ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశం జరుపుటకు వీలు కాదని తెలియజేశారు.