NDL: వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో ఆదివారం సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్సై సురేశ్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్న వారి ఇళ్లను తనిఖీ చేసి ధ్రువపత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను సీజ్ ఆదివారం చేశారు. తరువాత గ్రామస్థులతో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ, భూ తగాదాలపై అవగాహన కల్పించారు.