అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రజలంతా ఖాదీ వస్తాలను ధరించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ 126వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యసాధనకు స్వదేశీ ఉత్పత్తులే విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీజీ స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించారని గుర్తు చేశారు. స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగానికి పెద్దపీట వేయాలని కోరారు.