కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ షీటర్లకు ఎస్ఐ చంటిబాబు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరప్రవృత్తులను విడిచిపెట్టి సమాజంలో మంచివారిగా మారాలని సూచనలు ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలలో పాల్గొనకుండా కుటుంబాలతో కలిసి సన్మార్గంలో నడవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.