CTR: కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం నాట్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రవి కుటుంబంతో చెన్నై వెళ్లి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. నాట్రంపల్లి వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రవి కుమారుడు, సాత్విక్ (17) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.