KMM: ఖమ్మం రేవతి సెంటర్లో గత 60ఏళ్ళుగా నివాసం వున్న వారికి ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులతో కలిసి శనివారం కేఎంసీ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.