KRNL: ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామంలో రెండు రోజుల భారీ వర్షాలకు ఓ నిరుపేద కుటుంబం ఇల్లు ఇవాళ కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. అనారోగ్యంతో ఉన్న ఇంటి పెద్ద, కూలి పనికి వెళ్లే భార్య, ముగ్గురు పిల్లలతో ఉన్న ఆ కుటుంబానికి ఇల్లు కూలడం పెనుభారంగా మారింది. ప్రభుత్వం స్పందించి తమకు ఇంటి నిర్మాణం కోసం ఆదుకోవాలని కోరుతున్నారు.