మహబూబ్ నగర్ జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగర్ పూర్తిస్థాయిలో నిండుతుంది. ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్దవాకతో పాటు సూరారం, బాబు కొమ్మూరు, పెద్దబాబు, లింగాలచేడు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ సందర్భంలో చెరువు నిండుకుంది. దాంతో అధికారులు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.