ప్రకాశం: దసరా సెలవుల్లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్లే అవకాశం ఉందని, తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచాలని పామూరు సీఐ భీమా నాయక్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు పామూరు సర్కిల్ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని చెప్పారు. ఈత కొట్టేందుకు వెళ్లిన పిల్లలు అందులోకి దిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కాగా, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు