సత్యసాయి: రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్లో మంత్రి ఎస్. సవిత దసరా పండుగ సందర్భంగా 30 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మిక మహిళలకు చీరలతో పాటు పసుపు కుంకుమ కోసం ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున అందజేశారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసి కుటుంబాలతో విజయదశమిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.