ప్రకాశం: పేదరికంతో ఏ వ్యక్తి న్యాయ సేవలను కోల్పోవద్దనే లక్ష్యంతో ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఇందులో భాగంగా శనివారం కనిగిరిలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవల పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.