WNP: జిల్లాలోని విద్యార్థులు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. నాగవరంలో రూ.6.76 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏటీసీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా శనివారం ప్రారంభించారు. ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెఘారెడ్డిలతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.