నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ తహసీల్దార్ శ్రీ వాణి పేర్కొన్నారు. గ్రామంలోని బీసీ కాలనీలో వరదనీరు చేరిన విషయం తెలుసుకుని ఆస్ఐ.మాధవి రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రామచంద్ర రావు, తహసీల్దార్ శ్రీవాణి పర్యటించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరుకుంటోందని పేర్కొన్నారు.