HYD: హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ (HNEW), చార్మినార్ పోలీసులతో కలిసి డ్రగ్ పాడ్లర్ను అరెస్ట్ చేశారు. 45 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి, 2 కిలోల గంజాయి, రూ.1.03 లక్షల నగదు, యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. మొత్తం విలువ రూ.4 లక్షలు ఉంటుందని, NDPS చట్టం కింద కేసు నమోదైనట్లుగా పేర్కొన్నారు.