ATP: గుంతకల్లు పట్టణంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్ సమీపంలో పాత భవనం తొలగిస్తుండగా పైకప్పు మీద పడి దాసరి వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన భర్త మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి సతీమణి పద్మ కోరారు.