GDWL: స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో పోరాడిన ఏకైక వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను భావితరాలు గుర్తుంచుకుంటాయని గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ అజిత్, నాగేష్ సహా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.