VKB: తాండూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, SPతో కలిసి MLA మనోహర్ రెడ్డి పరిశీలించారు. కోకట్లో కాగ్నా నది ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెనను వారు పరిశీలించారు. వరద తగ్గాక తాత్కాలిక మరమ్మతులు చేపడతామని MLA తెలిపారు. భారీ వర్షాల నష్టాన్ని CM దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు.