CTR: ప్రతి PHC పరిధిలో గర్భిణీ స్త్రీల నమోదు వంద శాతం జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్యాధికారులతో కలిసి వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు గర్భిణీ స్త్రీల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అంగన్వాడీ రిజిస్టర్ నందు సరి చూసుకోవాలన్నారు.