GNTR: ప్రపంచ అనుభవాలను పరిశీలిస్తే సాంఘిక పెట్టుబడి బలంగా ఉన్న దేశాలే వేగంగా అభివృద్ధి చెందాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పి.వి. రమేష్ పేర్కొన్నారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో శనివారం జరిగిన చేయూత ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.