GDWL: నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శనివారం గద్వాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.