TG: హైదరాబాద్లోని మూసారాంబాగ్ వద్ద మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూసారాంబాగ్ పాత వంతెన పూర్తిగా నీటమునిగింది. దాదాపు 10 అడుగుల ఎత్తున వరద నీరు వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. ఈ ఉద్ధృతికి నూతన వంతెన నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి, కొన్ని స్లాబ్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.