మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన సినిమా ‘మాస్ జాతర’. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 31న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.